Aug 18,2023 21:15

పనులను పరిశీలిస్తున్న స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ

ప్రజాశక్తి- డెంకాడ : మండ లంలోని సింగవరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, పిఆర్‌ అండ్‌ ఆర్‌డి బి రాజశేఖర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని పరిశీలించి నాణ్యమైన మెటీరియల్‌ వాడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వాటికి వాడే డోర్లు మిగిలిన మెటీరియల్‌ అన్ని క్వాలిటీవి వేయాలని సూచించారు. ఇంజనీరింగ్‌ అధికారులకు నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పనులు గురించి సూచనలు సలహాలు అందించారు. జెజెఎం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌బికె, వెల్నెస్‌ సెంటర్లను పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో సిబ్బంది ప్రజలకు అందుతున్న సేవలు గురించి అడిగారు. రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కావలసిన సేవలు అందించాలని ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్‌ అప్పారావు, ఎంపిడిఒ డిడి స్వరూప రాణి, ఎఒ ఎం నిర్మల పలు శాఖలు అధికారులు ఉన్నారు.