Aug 24,2023 20:16

డాక్‌యార్డు వద్ద సీతం కళాశాల విద్యార్థులు

ప్రజాశక్తి-విజయనగరం :   స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడేట్‌లు, ఉపాధ్యాయులు, విశాఖపట్నంలోని నావెల్‌ డాక్‌యార్డులో లో అమత్‌ -2023 పేరుతో నిర్వహిస్తున్న నౌకదళ విజ్ఞాన ప్రదర్శన లో పాల్గొన్నారు. నౌకల పరికరాలు,క్షిపణులను, యుద్ద వాహనాలను సందర్శించారు. విద్యార్థులంతా ఆసక్తితో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్శణ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సీతం కళాశాల ఎక్సలార్‌ తో అవగాహన ఒప్పందం
సీతం ఇంజినీరింగ్‌ కళాశాల, ఎక్సలార్‌ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఎక్సలార్‌ సీతం విద్యార్థులకు వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాలపైన శిక్షణ ఇస్తుంది. విద్యార్థులకు సంబంధించిన అకాడమిక్‌ ప్రాజెక్టు మార్గదర్శకత్వం, మలిదశ శిక్షణా కార్యక్రమం మొదలగు విషయాలులో సహాయం చేస్తుంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వెబినార్స్‌,సెమినార్స్‌ నిర్వహిస్తుంది. అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తుంది. కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశి భూషణ్‌ రావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డివి రామమూర్తి ఎక్సలార్‌తో అవగాహన ఒప్పందం జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు.