Sep 03,2023 21:51

వికలాంగులకు పరికరాలు అందిస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి - కొత్తవలస : వికలాంగుల సంక్షేమం కోసం గురుదేవ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు రాపర్తి జగదీష్‌ బాబు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ పూర్వపు అధికారి (ఐఆర్‌ఎస్‌) కెవి చౌదరి అన్నారు. ఆదివారం ట్రస్ట్‌ ఆవరణలో స్మాల్‌ ఇండిస్టీస్‌ డెవలప్మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో రూ.25 లక్షల నిధులతో 40 మంది లబ్ధిదారులకు జీవనోపాధి కల్పించడానికి, శ్రీగురుదేవ్‌ చాటిబుల్‌ ట్రస్ట్‌ ద్వారా 40 కిరాణా షాప్‌ బడ్డీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క సంస్థ కూడా ఇటువంటి సేవా కార్యక్ర మాలు చేయలేదని ఆయన అన్నారు. గురుదేవా ట్రస్టు ద్వారా కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం, కనీస వైద్య సదుపాయం అందించాలన్న తపనతో ఆస్పత్రిని కూడా నిర్మించిన ఘనత జగదీష్‌బాబుకే దక్కుతుందన్నారు. కిరణా షాపుల ద్వారా లబ్ధి పొందాలని ఆకాంక్షించారు. సిద్బీ (స్మాల్‌ ఇండిస్టీస్‌ డెవలప్మెంట్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా) స్వావాలంబన్‌ అండర్‌ సిఎస్‌ఆర్‌ ఇన్నోవేటివ్‌ నిర్వహించిన 30 మంది వికలాం గులకు సరుకులతో పాటు ఉచిత పాన్‌ షాప్‌లు, 50 మంది వికలాంగులకు కృత్రిమ కాళ్ళు, చేతులు, ట్రై సైకిల్స్‌, వీల్‌ చైర్స్‌, చెవిటి మెషిన్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో సిద్బీ డిజిఎం సౌరబ్‌ భాజపై, అసోసియేట్‌ మేనేజర్‌ శ్రీష్టి ఠాకూర్‌, హెవీ వాటర్‌ బోర్డు చైర్మన్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జి క్యూటివ్‌ ఎస్‌. సత్యకుమార్‌, సురేష్‌, శ్రీ గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఆర్‌.జగదీశ్‌ కుమార్‌, ఆస్పత్రి సిఇఒ డాక్టర్‌ అచ్చుత రామయ్య, బి. న్‌. రావు, ట్రస్ట్‌ స్టాఫ్‌, హాస్పిటల్‌ స్టాఫ్‌ పాల్గొన్నారు.