Aug 22,2023 21:38

రక్తదాతను అభినందిస్తున్న జనసేన నాయకుడు గురాన అయ్యలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రముఖ సినీనటులు, మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం, బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌ లో చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు ఆధ్వర్యాన పలువురు రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నాయకులు గురాన అయ్యలు కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్నిదాణాల్లో కన్నా రక్తదానం మహాగొప్ప దానమని, ప్రేమే లక్ష్యం, సేవేమార్గం అనే సిద్ధాంతాన్ని అలవర్చుకున్న, సేవకు ప్రతిరూపమైన మెగాస్టార్‌ చిరంజీవి బాటలోనే మెగాభిమానులు నడుస్తూ ఇటువంటి పలుసేవలు చేయటం సమాజానికి ఆదర్శమని అన్నారు ఆదాడ మోహనరావు, దంతులూరి రామచంద్ర రాజు, కె.కృష్ణారావు, జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు పాల్గొన్నారు. అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామినాయుడు పిలుపుమేరకు స్థానిక ఆంజనేయస్వామి కోవెలలో పూజలు నిర్వహించారు. అనంతరం న్యూ లైఫ్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో పలువురు రక్తదానం చేశారు. సాయంత్రం 6 గంటలకు ఆనంద గజపతి ఆడిటోరియంలో మెగాస్టార్‌ చిరంజీవి చిత్రంలోని పాటలు మ్యూజిక్‌ ఆర్కెస్ట్రా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ అధ్యక్షులు రాంకీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు.