ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. బుధవారం మలిచర్ల, సుంకర పేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, వెల్ నెస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామస్వరాజ్యం తెచ్చిన ఘనత వైసిపిదేనని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందిస్తూ, పూర్తిగా ఆదుకునే పరిస్థితిల్లో ఉన్నారన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి మెరుగైన పంట విధానాన్ని రాష్ట్రంలో తీసుకొస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతతంలో రాష్ట్రం ఎంతో అభివద్ధి జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలతో లేనిపోని అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు కెల్ల శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి కొసరి నిర్మల, సుంకరి పేట సర్పంచ్ సుంకరి రాజేశ్వరి, మలిచర్ల సర్పంచ్ తుమ్మగంటి రమాకుమారి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు కోలగట్ల శంకుస్థాపన
నగరంలోని 44వ డివిజన్ పరిధిలో రూ. 48.10 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బుధవారం ఆ డివిజన్లోని సుందరయ్య కాలనీ, చెంచుల కాలనీలలో సిసి రహదారులు, కల్వర్టులను ప్రారంభించారు. అనంతరం ఎస్‌కె డిగ్రీ కాలేజి సమీపంలో సిసి రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన ప్రజావసరాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రత్యేక దష్టి సారించి నగరంలో అనేక అభివద్ధి పనులు చేపడుతున్నారన్నారు. వైసిపి నాయకులు సైలాడ సత్యనారాయణ మాట్లాడుతూ తమ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ స్పీకర్ ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముచ్చు లయా యాదవ్, కార్పొరేటర్లు సైలాడ ఈశ్వరమ్మ, బొద్దూరు గోవిందమ్మ, జోనల్ ఇంచార్జ్ తమ్ము, వైసిపి నాయకులు మహేష్, సూరిబాబు, బొద్ధూరు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.










