
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని పెంచిన కరెంటు చార్జీల, ఉపసంహరించుకోవాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన నగరంలోని 3, 4, 30, 35, 39, 40, 53 సచివాలయాల వద్ద ధర్నాలు చేశారు. 35వ సచివాలయం వద్ద సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, 40వ సచివాలయం వద్ద నాయకులు ఎ.జగన్మోహన్‌రావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు ఫలితంగా నిత్యవసర సరుకులు ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రజలు పెరిగిన ధరలతో శతమతమవుతుంటే ఇవి చాలదన్నట్లు విద్యుత్ ఛార్జీలను కూడా పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి.రమణ, వి.లక్ష్మిచ, వి.రామచంద్రరావు, సన్నిబాబు, జగదాంబ, కర్రి.రమణమ్మ , శాంత మూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.
సంతకాల సేకరణ
తోటపాలెం వైఎస్‌ఆర్ కాలనీ, ఆర్‌అండ్‌బి రైతు బజారు వద్ద సిపిఎం నాయకులు జగన్మోహన్‌రావు ఆధ్వర్యాన సంతకాల సేకరణ చేపట్టారు. సచివాలయాల వద్ద జరిగిన ధర్నాలు అనంతరం అడ్మిన్ కార్యదర్శులకు వాటిని అందజేశారు.










