ప్రజాశక్తి-విజయనగరం రూరల్ : గుంకలాంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయం టైప్-2 భవనాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మంగళవారం ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.ముందుగా భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్తగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. అన్ని రకాల సేవలకు నిలయమైన సచివాలయం అందరికీ అందుబాటు లో ఉన్న ప్రదేశంలో నిర్మించారని, పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి వారికి సూచించారు. లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించే నిమిత్తం గుంకలాంలో రూ.6.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 63 కెఎవి ట్రాన్స్‌ఫార్మర్ ను వీరభద్ర స్వామి మీట నొక్కి ప్రారంభించారు. కార్యక్రమాల్లో గుంకలాం సర్పంచి నాగరాజు, ఎంపిపి మామిడి అప్పల నాయుడు, ఎఎంసి ఛైర్మన్ జమ్ము శ్రీను, స్థానిక ప్రజా ప్రతినిధులు, తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎఇ సంతోష్ కుమార్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.










