Aug 26,2023 19:41

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి- బొబ్బిలి :  ఈ నెల 30న జరగనున్న సామూహిక గృహా ప్రవేశాలకు జగనన్న ఇళ్లను సిద్ధం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు కోరారు. జగనన్న ఇళ్ల నిర్మాణంపై శనివారం మున్సిపల్‌, సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న ఐటిఐ కాలనీ లేఅవుట్‌లో జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌ పద్దతిలో ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి ముత్యాలనాయుడు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారని, ఇళ్లకు రంగులు వేసి సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌, ఆర్‌ఒ ప్రసాద్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.