Aug 22,2023 20:52

రక్తదానం చేస్తున్న యువత

ప్రజాశక్తి - పూసపాటిరేగ : మెగాస్టార్‌ చిరంజీవి జన్మదినోత్సవం సందర్బంగా మంగళవారం స్ధానిక బ్రిడ్జి క్రింద జనసేన మండల పార్టీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరానికి విశేష స్పందన లబించింది. ఎన్‌విఎన్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిభిరంలో 75 యూనిట్లు బ్లడ్‌ను జన సైనికలు, నాయకులు, యువత దానం చేశారు. ఈ శిభిరాన్ని నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు లోకం మాదవితో పాటు జిల్లా జనసేన నాయకులు గురాన అయ్యలు, ఉత్తరాంధ్ర మహిళా కో ఆర్డినేటర్‌ తుమ్మి లక్ష్మిరాజ్‌ తదితర నాయకులు సందర్శించి జనసైనికులును అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏటా చిరంజీవి జన్మధినోత్సవం సందర్బంగా ఈ రక్తదానం శిభిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిరంజీవి చూపిన సేవాభావంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రక్తదాన శిభిరంలో మండల పార్టీ అధ్యక్షలు జలపారి అప్పడుదొర (శివ), నాయకులు బూర్లె విజయశంకర్‌, స్మార్ట్‌ రమేష్‌, కె. రమేష్‌, మాదేటి ఈశ్వర్రావు, బలభద్రుని జానకీరామ్‌, అప్పలరాజు పాల్గొన్నారు