ప్రజాశక్తి- శృంగవరపుకోట : పట్టణంలోని ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో శిక్షణ పొందుతున్న ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన క్రీడాకారులు ఏం.రాకేష్ అండర్-11, ఎండీ నిషాద్ ఫాతిమా, మోపాడ జాన్సన్ లు అండర్ -13 విభాగంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. వీరు సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రథమస్థానం సాధించి త్వరలో ప్రకాశం జిల్లా ఒంగోలు, ఈస్ట్ గోదావరి జిల్లా మల్కిపురంలలో జరగబోవు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగంలో జిల్లా టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. వీరు ఆగస్టు నెల 7వ తేదీన విజయనగరం పట్టణానికి ఆనుకొని ఉన్న పడాలపేట ఏపిక్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి చాంపి యన్షిప్ కం సెలక్షన్స్‌లో విజయం సాధించారు. డబుల్స్‌లో ఏం.రాకేష్ ప్రథమ స్తానం, మొహమ్మద్ నిషాద్ ఫాతిమా సింగిల్స్, డబుల్స్‌లో ప్రథమ, మోపాడ జాన్సన్ సింగిల్స్, డబుల్స్‌లో ప్రథమ స్థానం సాధించి జిల్లా చాంపియన్లుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శ్రీరాములు తెలి పారు. వీరిని ఎమ్మెల్సీ, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎస్‌కోట ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు ఆయన నివాసంలో గురు వారం అభినందించినట్లు చెప్పారు. క్రీడాకారులకు ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్‌వి సత్యశేఖర్, స్నేహ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఏఎస్ వెంకట్రావు, ఆనల రమేష్, ఆనల మోహన్, కోచ్ ఎండి అస్లాంలు అభినందించారు.










