ప్రజాశక్తి - జామి : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని ఆపార్టీ సీనియర్ నాయకులు చందక రామదాసు అన్నారు. జామి సీతారామ కళ్యాణ మండప ంలో ఆదివారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రామదాసు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే పవన్ ముఖ్య మంత్రి కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలం లోని వివిధ గ్రామాల నుంచి నాయకులు పార్టీలో చేరారు. జామి మండల కేంద్రంలో ప్రముఖ న్యాయవాది బుసర్ల రమణారావు పార్టీలో చేరి, వైసిపి నాయకులు బెదిరింపులకు బయపడవద్దని జన సేన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్త వాక స్వామినాయుడు కుటుంబ సభ్యులకు రూ.20వేలు ఆర్థిక సాయం చేశారు. స్వామినాయుడు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా నాయకులు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్.కోట, గజపతినగరం నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్తిబాబు, మర్రాపు సురేష్, జిల్లా నాయకులు ఎం.రవికుమార్, అదాడ మోహనరావు, బాలు, వబ్బిన సన్యాసి నాయుడు, జామి మండల నాయకులు వర్మరాజు, రాంబాబు, పాల్గొన్నారు.










