ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఈనెల 30 నుంచి నాలుగు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు గురాన అయ్యలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న హొటల్ జిఎస్‌ఆర్ వద్ద జనసేన రాఖీల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. 31న పలు వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయనున్నామన్నారు. 1వ తేదీన పర్యావరణ పరిరక్షణ కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటుతామన్నారు. 2న జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేయడంతో పాటు ఉదయం కోట జంక్షన్ వద్ద అల్పాహారం పంపిణీ చేస్తామన్నారు. గాజులరేగ, కోట జంక్షన్, కంటోన్‌మెంట్ గెంజిపేట ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి మందుల పంపిణీ చేస్తామన్నారు. అదేరోజు మధ్యాహ్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమాలతో పాటు పలు వార్డుల్లో బర్త్‌డే కేక్ కటింగ్, వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ
గజపతినగరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో రోగులకు పళ్ళు, రొట్టెలను పంపిణీ చేశారు. అనంతరం రోగులకు ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు సరిగ్గా లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి మాటల్లో తెలుస్తుందని జనసేన ప్రభుత్వం వచ్చాక మంచి వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పిచే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు డా.రవి కుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు పండు, శ్రీను, మహేష్, చరణ్, శంకర్, చాలం, పీరు తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు సందర్భంగా సోమవారం బొబ్బిలిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో కోట జంక్షన్ తాండ్రపాపారాయ బొమ్మ దగ్గర ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆహార శిబిరం వద్ద భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు సంచనా గంగాధర్, లెంక రమేష్, పల్లెం రాజా, గేదెల శివ, నరేష్, శ్రీను, రేవలా కిరణ్, సత్య, సంతోష్, సతీష్, హేమంత్, పోలి నాయుడు తదితరులు పాల్గొన్నారు.










