Aug 30,2023 21:07

పూడికతీత పనులను పరిశీలిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని జొన్నగుడ్డి వద్ద పెద్దకాలువలో భారీగా పూడికలు పేరుకుపోయి, మురుగునీరు నిల్వ ఉండిపోవడంతో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి సంబంధిత సిబ్బందితో మాట్లాడి పనులు చేయించారు. బుధవారం మధ్యాహ్నం స్వయంగా పూడికతీత పనులను పరిశీలించారు. చెత్తాచెదారాలను తొలగించి మురుగునీరు సాఫీగా పోయేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఇప్పిలివీధి వద్ద రహదారిపై కుళాయి నీరు లీకేజీలు ఉండటాన్ని పరిశీలించి, వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. లీకేజీని అరికట్టేందుకు శాశ్వత పనులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎఇ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.