ప్రజాశక్తి - కొత్తవలస : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని శ్రీలలిత కన్వెన్షన్ హాల్లో గ్రామ వాలంటీర్లకు, గృహ సారుదులకు శనివారం ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజరు కుమార్ ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహ సారధులు, వాలంటీర్లు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరవేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకు, అవినీతికి నేడు సిఐడి నోటీసులు జారీ చేసి అరెస్టు చేస్తే, అందులో కూడా జగన్ మోహన్ రెడ్డి అస్తమే ఉందని ప్రచారం చేయడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, మాజీ ఎంపిపి గొరపల్లి శివ, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
వేపాడ: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కుమ్మపల్లి సచివాలయం పరిధిలో కృష్ణ రాయుడు పేటలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వేచలపు చినరామునాయుడు, ఎఎంసి చైర్మన్ మూకల కస్తూరి, ఎంపిపి దొగ్గ సత్యవంతుడు, వైసిపి మండల అధ్యక్షులు మమ్ములూరి జగన్నాథం, మండల జెసిఎస్ ఇంచార్జ్ బోజంకి శ్రీను, వైస్ ఎంపిపి అడపా ఈశ్వర్ రావు, స్థానిక సర్పంచ్ సిహెచ్ ముసలి నాయుడు, ఎం.రామకృష్ణ, సచివాలయం కన్వీనర్లు నాగ స్వప్న, శ్రీను, సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.










