నదిలో పడి మృతి చెందిన మంగమ్మ
ప్రజాశక్తి - నెల్లిమర్ల : ప్రమాదవశాత్తూ బుధవారం స్థానిక చంపావతి నదిలో పడి పూతిక పేటకు చెందిన యడ్ల మంగమ్మ (49) మృతి చెందారు. మంగమ్మ గుర్ల మండలం గోషాడ బంధువుల పరామ ర్శకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ప్రమాద వశాత్తూ జ్యూట్ మిల్ గెస్ట్ హౌస్ సమీపంలోని చంపావతి నదిలో పడి మృతి చెందింది. మంగమ్మకు చిన్న తనంలో వివాహం జరిగి భర్త వదిలి వేయడంతో తండ్రి వద్ద ఉంటుంది. స్థానిక ఎస్‌ఐ పి.నారాయణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.










