ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఉద్ఘాటించారు. ఆదివారం ఒకటో డివిజన్ పూల్‌బాగ్ ప్రాంతంలోని హనుమాన్ నగర్, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంతాలలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 57 లక్షల రూపాయలతో నిర్మించిన రహదారులు, కాలువలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్‌ఛార్జులు ముద్దాడ మధు, ముచ్చు శ్రీనివాసరావు మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన అభివృద్ధి పనులను పూర్తిచేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయా యాదవ్, మాజీ కౌన్సిలర్ గదుల సత్యలత, దాసు, సీతాలు తదితరులు పాల్గొన్నారు.
వైసిపిలో పలువురి చేరిక
విజయనగరం మండలంలోని నారాయణపురానికి చెందిన 90 కుటుంబాలు టిడిపిని వీడి వైసిపిలో చేరాయి. వారికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కండువాలు కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు. వైసిపి మండల అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జొన్నవలస పిఎసిఎస్ అధ్యక్షులు కెల్లా త్రినాథ్, యువజన విభాగం మండల నాయకులు సువ్వాడ శ్రీను పాల్గొన్నారు.










