Aug 29,2023 21:05

ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ఎంపిడిఒ, తదితరులు

ప్రజాశక్తి- పూసపాటిరేగ : ప్రజాశక్తి ప్రజల పత్రిక అని ఎంపిడిఒ జి.రామారావు అన్నారు. మంగళవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ప్రజాశక్తి 43వ వార్షికోత్సవ ప్రత్యక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించ డంలో ప్రజాశక్తి పత్రిక తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. నిజాలను నిర్భయంగా రాయగలిగే పత్రికల్లో ప్రజాశక్తి ఒకటి అన్నారు. ప్రజాశక్తి లాంటి పత్రికలు నేటి పోటీ ప్రపంచంలో మన్న గలుగుతున్నాయంటే అది ప్రజాశక్తిలో పనిచేస్తున్న సిబ్బంది కమిట్మెంట్‌ అని చెప్పాలన్నారు. వైసిపి మండల నాయకులు మహంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాశక్తి తనదైన శైలిలో వార్తలు ప్రచురించడంలో దిట్ట అన్నారు. మహంతి జనార్దన్‌ రావు మాట్లాడుతూ ప్రధాన పత్రికల్లో వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ప్రజాశక్తి లాంటి పేపర్లో వార్తలు తప్పనిసరిగా చూడాలన్నారు. సర్పంచ్‌ టెంపుల్‌ సీతారాం మాట్లాడుతూ పేద బడుగు బలహీనవర్గాల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ప్రజాశక్తి లాంటి పేపర్ను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ రాజకుమార్‌, పంచాయతీ అధికారి డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.