Sep 08,2023 21:50

సంక్షేమ పథకాల బుక్‌లెట్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శంబంగి

-రామభద్రపురం: ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని కొండకెంగువలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరాతీశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధిని బుక్‌లెట్ల రూపంలో పంచిపెట్టారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ప్రజలందరికీ తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా ఉందన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే శంబంగికి స్థానిక నాయకులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి అప్పికొండ సరస్వతి, వైస్‌ ఎంపిపి బెల్లాన ప్రసాద్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాయలు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ చింతల సింహాచలం నాయుడు, తహశీల్దార్‌ రాజారావు, వైసిపి నాయకులు ప్రసాద్‌, చంద్రశేఖర్‌, పైడిరాజు పాల్గొన్నారు.