Aug 30,2023 20:52

బొబ్బిలి: సంతకాలను సేకరిస్తున్న సిపిఎం నాయకులు శంకరరావు, తదితరులు

ప్రజాశక్తి- రేగిడి : ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని ఉణుకూరు గ్రామంలో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విద్యుత్‌ భారం, అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలపై సిపిఎం నాయకులు పోరెడ్డి విశ్వనాథం, ఎం. త్రినాధ్‌, కె. తిరుపతిరావు సంతకాలు సేకరించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ధరలు అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలిస్తూ పేద ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్నారని ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 1న సచివాలయం ముందు కరెంట్‌ బిల్లులను దగ్ధం చేసి ధరలు తగ్గించాలని ధర్నా, 3న నిరుద్యోగ సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 4న తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలను చేపడుతున్నామని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
లక్కవరపుకోట: మతోన్మాది నరేంద్రమోడీని అడుగడుగునా నిలదీయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం సంతకాల సేకరణ చేశారు. ప్రజా సమస్యలపై సెప్టెంబర్‌ 4 వరకు జరుగుతున్న నిరసన కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కొత్తవలస: నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాలని పెంచిన కరెంటు చార్జీలు ఉపసంహరించుకోవాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో కొత్తవలస సిమెంట్‌ రోడ్డులో సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం నాయకులు గాడి అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజాం: కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు నిత్యవసర ధరలు, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, ఉద్యోగం, ఉపాధి కల్పించాలని సిపిఎం నాయకులు సిహెచ్‌ రామ్మూర్తి నాయుడు డిమాండ్‌ చేశారు. మండలంలోని కంచరాం గ్రామంలో సమరభేరి కార్యక్రమంలో భాగంగా బుధవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్యరావు, శ్రీనివాసరావు, ఆదియ, ప్రసాదు, గంగరాజు, తులసి, మల్లేశ్వరి, రాధా తదితరులు పాల్గొన్నారు.
మెంటాడ: ధరలు పెంపకంపై సిపిఎం పార్టీ అవలంబిస్తున్న ధరలు స్థిరీకరణ నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాములు విమర్శించారు. బుధవారం మెంటాడ ఎస్సీ కాలనీలో ధరల నియంత్రణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విది విధానాలు విడనాడాలని సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేగిడి నరసింహులు, ఆల్మండ్‌ సన్యాసిరావు, దేవుడు, మొర్చ తాత తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: స్థానిక చిక్కాల, రెల్లి వీధిలో సిపిఎం పార్టీ ఆధ్వంర్యంలో బుధవారం సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. శంకర్రావు, శాఖ కార్యదర్శి బి. యుగంధర్‌, గౌరీ, వెంకటరమణ జె. శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని ఎం.బూర్జవలస గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.గోపాలం, నాయకులు జి.అప్పలనాయుడు, కె.శంకర, తదితరులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ : మోడీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం పూసపాటిరేగలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార బేరి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సిపిఎం నాయకులు బి. సూర్యనారాయణ ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.