Sep 06,2023 20:36

ఆక్రమణలను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ సూర్యకుమారి

ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని కొండగంగుపూడి పంచాయతీ పరిధిలో గల విజయరామసాగర్‌ ప్రభుత్వ భూముల్లో ఉన్న ఆక్రమణలను ఆర్‌డిఒ సూర్య కుమారి ఆధ్వర్యంలో బుధవారం సర్వే చేసి తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రసన్నకుమార్‌, డీటీ సన్యాసినాయుడు, ఆర్‌ఐ రామలక్ష్మి, మండల సర్వేయర్‌ అప్పలనాయుడు, గ్రామ రెవెన్యూ అధికారి అప్పారావు, ఎస్‌కోట సర్వేయరు తదితరులు పాల్గొన్నారు.
కాలనీ నిర్మాణం పనులు చేపట్టవద్దని ఆదేశం
మండలంలోని జగ్గయ్యపేటలో గుడివాడ వాన చెరువు గర్భంలో జగనన్న ఇంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆర్‌డిఒ ఆదేశాలు జారీ చేశారు. చెరువు గర్భంలో నిర్మానాలు చేపట్టడం వల్ల ఆయుకట్టు రైతులకు సాగు నీరు ఉండదని రైతులు రొంగలి వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు పనులు నిలుపుదల చేయమని ఆదేశించిన నేపథ్యంలో ఆమె ఈ ఆదేశాలు ప్రకారం బుధవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు.