May 10,2023 23:03

మాట్లాడుతున్న చిన్నయ్యపడాపల్‌

ప్రజాశక్తి-పాడేరు: పాడేరులో ఈనెల 11న నిర్వహించనున్న చలో కలెక్టరేట్‌ కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఏపీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిన ఎర్రవరం ప్రాంతంలో బుధవారం గిరిజన సంఘం నాయకులు పర్యటించి చలో కలెక్టరేట్‌ కార్యక్రమం పై ప్రజలకు తెలియపరిచారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో గిరిజన సంఘం అల్లూరి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, పోరాటంతోనే హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఆపుదాం రేపు జరిగే చలో కలెక్టరేట్‌కి కదలి రావాలని పిలుపునిచ్చారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు బాధిత గ్రామాల గిరిజనులతో సమావేశం నిర్వహించి పోరాటమే మన ముందున్న మార్గమని వేరే మార్గం లేదని అన్నారు.
చలో కలెక్టరేట్‌ కి ప్రధానమైనటువంటి అంశాలు
బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని రద్దు చేయాలిజీవో నెంబర్‌ 3కి చట్టబద్ధత కల్పించి 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలి. అల్లూరు జిల్లాలో చింతపల్లి, కొయ్యూరు, అనంతగిరి మండలాల్లో హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని రద్దు చేయాలి. కాఫీ రైతులకు 2018 నుండి 2022 వరకు 60 కోట్ల నిధులు గిరిజన రైతులకు ఇవ్వాలనే ప్రధానy
ెుౖన డిమాండ్లతో ఈ కార్యక్రమం జరుగు తుందని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజరు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు బాధితులు గూడెపు రాజు, రామకృష్ణ, చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.
గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న పృద్విరాజ్‌,,,
పెదబయలు :ఈనెల 11న చేపట్టే చలో కలెక్టరెట్‌ను విజయవంతం చేయాలనీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్విరాజ్‌ కోరారు. మండల కేంద్రంలో గోడపత్రికలను గిరిజన సంఘం పూర్వ అధ్యక్షుడు బొండా సన్నిబాబు, స్థానిక వైస్‌ సర్పంచ్‌ బి గంగాధరం, సీఐటీయూ నేత సిహెచ్‌ రామారావు, మండల కమిటీ నాయకులు జె.సునీల్‌ ఆవిష్కరించారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్విరాజ్‌ మాట్లాడుతూ, బోయ/వాల్మీకిలను గిరిజన జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీ లో చేసిన తీర్మానన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. హెడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ అనుమతులు రద్దు చేయాలన్నారు. గిరిజన సంఘం పూర్వ అధ్యక్షులు బొండా సన్నిబాబు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో ఉన్న అటవీ సంపదను బడా కార్పొరేట్‌లకు కట్టబెట్టాలని చూస్తుందన్నారు. గిరిజన ప్రాంతంలో 1/70 పటిష్టంగా అమలు పరచాలన్నారు. గిరిజన ఉద్యోగులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.