Aug 22,2023 20:55

తెర్లాం: పథకాలు గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే శంబంగి

ప్రజాశక్తి - తెర్లాం : మండలంలోని పలుకువలసలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి బొబ్బిలి మండల అధ్యక్షులు వేణుగోపాల్‌ నాయుడు, ఎంపిపి ఉమాలక్ష్మి, సత్యనారాయణ, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
షటిల్‌ కోర్టు ఏర్పాటు చేయాలి
నెల్లిమర్ల: నగర పంచాయతి పరిధి గాంధీ నగర్‌ కాలనీలో షటిల్‌ బ్యాడ్మింటెన్‌ కోర్టు ఏర్పాటు చేయాలని అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బడ్డు కొండ అప్పల నాయుడుని షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసయేషన్‌ ప్రతినిదులు స్థానిక గాంధీ నగర్‌ కాలనీలో కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై వెంటనే స్పందించి కోర్టు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కి ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదేశించారు. ఆటస్థల కేటాయింపు అవసరాన్ని ఎమ్మెల్యేకి వైసిపి సీనియర్‌ నాయకులు చిక్కాల సాంబశివరావు వివరించారు. ఆ మేరకు ఎమ్మెల్యే గాంధీ నగర్‌ కాలనీలో ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పైడిరాజు, లక్ష్మణరావు, రవికిరణ్‌ నల్లి శివ, శేఖర్‌, మురళి, రామారావు, రంగారావు పాల్గొన్నారు.