ప్రజాశక్తి-రేగిడి : పక్కా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఈ మేరకు ఉంగరాడమెట్ట వద్ద చిన్నయ్యపేట సెంటర్ నుంచి రాజాం జిఎంఆర్‌ఐటి వరకు, రాజాం గాయత్రి కాలనీ నుంచి బొబ్బిలి సెంటర్ వరకు 18.5 కిలోమీటర్ల మేర రూ.9 కోట్లతో నూతనంగా తారురోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకొండ- రాజాం ప్రధాన రహదారిలో ఎన్నో ఏళ్లనాటి ఇబ్బందులు ప్రజలకు తీరినట్టేనన్నారు. ఆర్‌అండ్‌బి డిఇ కె.వి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రధానరహదారి నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, ఎంపిపి ధార అప్పలనరసమ్మ, వైస్ ఎంపిపిలు టంకాల అచ్చెంనాయుడు, వి.జగన్మోహనరావు, మండల విప్ మజ్జి శ్రీనివాసరావు, ఉమ్మడి శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఎస్.జగన్‌మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, వైసిపి నాయకులు తలే రాజేష్, పి.శ్రీనివాసరావు, వి.చక్రపాణి, రేగిడి, సంకిలి సొసైటీ అధ్యక్షులు వంజరాపు అశోక్, వేణు, తహశీల్దార్ టి.కళ్యాణ్ చక్రవర్తి, ఆర్‌అండ్‌బి జెఇ నాగభూషణరావు పాల్గొన్నారు.










