ప్రజాశక్తి - లక్కవరపుకోట : పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. నూతనంగా మంజూరైన పింఛన్లను ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఎంపిడిఒ జ్ఞానేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తోడపుట్టిన వారు కూడా చూడని ఈ రోజులలో నెల నెలా ఠంఛనుగా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. డబ్బులు లేకపోయినా వీరికి టిఫిన్ దుకాణాలలో చాలా చోట్ల నెలంతా టిఫిన్ ఇస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి గేదెల శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్తగా 337 మంది అర్హులను గుర్తించి, పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి తూర్పాటి వరలక్ష్మి, జెసిఎస్ కన్వీనర్ యడ్ల కిశోర్‌కుమార్, వైస్ ఎంపిపి శ్రీనురాజు, మండల కోఆప్షన్ మెంబర్ షేక్ ఖాసిం, సర్పంచులు ఆదిరెడ్డి అర్జున, గోకాడ ముసలినాయుడు, ముమ్మన ప్రసాదరావు, కొయ్యన కృష్ణ, సోంబాబు, ఆవాల సత్యనారాయణ, పినిశెట్టి కిష్టప్పదొర, జామి అప్పలరాజు, ఎఎంసి డైరెక్టర్ కొట్యాడ శ్రీనివాసరావు, ఎంపిటిసిలు భూమిరెడ్డి స్వామినాయుడు, బోకం అప్పారావు, కవలపల్లి జక్కన్నదొర, లెక్కల వీరబాబు, తూర్పాటి అప్పలరాజు పాల్గొన్నారు.










