Aug 26,2023 20:53

అముదాలవలస బిఎల్‌ఒతో మాట్లాడుతున్న పీడీ సుధాకర్‌

ప్రజాశక్తి- రేగిడి : ఓటరు జాబితాలో ఎఫ్‌7 ద్వారా తొలగించిన ఓటర్లను మెప్మా పీడీ బి.సుధాకర్రావు పరిశీలించారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో శనివారం ఓటర్ల జాబితాలను పరిశీలించారు. గ్రామపంచాయతీ వారీగా బిఎల్వోలు తొలగించిన ఓటర్‌ జాబితా ను క్షుణ్ణంగా పరిశీలించారు. 2022లో ఎఫ్‌7 ద్వారా తొలగించిన ఓటర్‌లను పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా తయారు చేసిన ఫైల్‌ జాబితాను తనిఖీ చేశారు. ఆర్‌. ఆమదాలవలస సచివాలయంలో బూత్‌ లెవెల్‌ అధికారులు తొలగించిన ఓటర్లు వివరాలను తీసుకొని తయారు చేసిన రిజిస్టర్‌తో సరిపోల్చి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్‌ జాబితా పారదర్శకంగా ఉండాలన్నారు. తప్పు, ఒప్పులు, ఫోటోలు మార్పిడి వంటివి గడువు లోగా సరి చేయాలని సూచించారు. ఓటర్‌ జాబితాలో నిష్పక్షపాతంగా వ్యవహరించి రాజకీయ పార్టీల ద్వారా ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. ఈయనతో పాటు తహశీల్దార్‌ కళ్యాణ చక్రవర్తి, బూత్‌ లెవెల్‌ అధికారులు ఉన్నారు.