ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం సుమారు గంటపాటు భారీగా కువరగా ఆ తరువాత మోస్తారుగా కురిసింది. దీంతో గంటస్తంభం, మార్కెట్ ప్రాంతం, సిటీ బస్టాండ్, గణేష్ కోవెల రోడ్డు నీటితో నిండి పోయింది. రాజీవ్ నగర కాలనీ, బుచెన్న కోనేరు పల్లపు ప్రాంతలు జలమయమయ్యాయి. సిటీ బస్టాండ్ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వర్షం పడుతుండటంతో పుట్ పాత్ వ్యాపారులు, తోపుడు బండ్లు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. గురువారం సాయంత్రం కూడా వర్షం పడటంతో శ్రావణ శుక్రవారం వ్యాపారం జరగకుండా ఆటంకం కలిగించింది. గత మూడు రోజులుగా సాయంత్రం పూట కురుస్తున్న వర్షం వలన ప్రజలు, ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. లో తట్టు ప్రాంతాలు లో వర్షం నీరు చేరడంతో మున్సిపల్ సిబ్బంది, కార్మికులు రోడ్లపై నీటిని కాలువల ద్వారా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.










