Aug 30,2023 21:01

ప్రచారం చేస్తున్న టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : నెల్లిమర్ల నగర పంచాయతీలో 4,5,11 వార్డుల్లో నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో బుధవారం టిడిపి మహాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి విజయనగరం పార్లమెంట్‌ మహిళ అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇంటిటికి తిరిగి చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ టిడిపి అధికారలంలోకి వచ్చిన వెంటనే 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు నేరుగా అందిస్తారన్నారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకొనే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15వేల రూపాయలు నేరుగా ఆ తల్లికే అందిస్తామన్నారు. దీపం పేరుతో ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బైరెడ్డి లీలావతి, చిల్ల పద్మ, లెంక హైమావతి, కింతాడ కళావతి, చీకటి సుహాసిని, కోట్ల సునీత, ముడుమంచి లక్ష్మి, పొడుగు కృష్ణవేణి, చందక గౌరి, వాసు, అప్పారావు, అవనాపు సత్యనారాయణ పాల్గొన్నారు.