ప్రజాశక్తి - గజపతినగరం : సెప్టెంబర్ 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున పురస్కరించుకొని ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 2 వరకూ వారోత్సవాలను నిర్వహించనున్నామని ఆ పార్టీ నియోజ కవర్గ నాయకులు మర్రాపు సురేష్ అన్నారు. వారోత్సవాల కార్యాచరణపై శనివారం ఆ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు. ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమం, రెండువ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్లు, పండ్లు పంపిణీ, మూడవరోజు మెగా రక్తదాన శిబిరం, నాలుగో రోజు అన్నదానం కార్యక్ర మం, ఐదవ రోజు పాతబగ్గాం గ్రామంలో మెగా వైద్య శిబిరం, ఆరవ రోజు సర్వమత ప్రార్థనలు, ఏడవ రోజు జన్మదిన మెగా బైక్ ర్యాలీ, కేక్ కటింగ్, ఊరేగింపుతో పుట్టిన రోజు వేడుకలు, తరువాత మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుందని అన్నారు. అనంతరం వారోత్సవాల పోస్టర్‌ను విడు దల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు, గజపతినగరం నియోజకవర్గం నాయకులు, పాల్గొన్నారు.
బొబ్బిలి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి బొబ్బిలి జనసైనికుల నిలయం (మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా) వద్ద తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు తెలిపారు. బొబ్బిలిలో నిర్వహిస్తున్న ఇలాంటి మంచి సేవా కార్య క్రమంలో అభిమానులు, జన సైనికులు, ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని కోరారు.










