ప్రజాశక్తి- బాడంగి : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బొబ్బిలి డిప్యూటీ డిఇఒ బ్రహ్మాజీరావు అన్నారు. బుధవారం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా సైన్స్ స్కూల్ కాంప్లెక్స్ జరుగుతున్న తీరును పరిశీలించి ఉపాధ్యాయులు సైన్స్ కాంప్లెక్స్ ఉపయోగించుకొని వినూత్న బోధనా పద్ధతులు పాటించాలని సూచించారు. టిఎల్‌ఎమ్ సరిగా వాడాలని, విద్యార్థులు సైన్స్ విద్య పట్ల మక్కువ చూపేలా భోధన ఉండాలని, ఉపాధ్యాయులందరూ గ్రేడింగ్ ఎనాలసిస్ సరిగా పాటించి విద్యా ప్రమాణాలు మెరుగుదలకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనం పథకం అమలవుతున్న తీరును పరిశీలించి భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు మెనూ పాటిస్తూ రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని హెచ్‌ఎం, ఎండిఎం సిబ్బందికి సూచన చేశారు. 10వ తరగతి విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రతి విద్యార్థి ప్రగతిని మదింపు చేయాలని పాఠ్యప్రణాలకు ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని ఎస్‌ఏ-1 పరీక్షలపై పూర్తిస్థాయి మదింపు గ్రేడింగ్ సిద్దం చేయాలని ఆదేశించారు. పిల్లలు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని, పాఠశాల మైదానంలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపా ధ్యాయులు దత్తి సత్యన్నారాయణ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










