Sep 08,2023 19:24

పులిదాడిలో మృతి చెందిన ఎద్దు

ప్రజాశక్తి-బాడంగి :  విజయనగరం జిల్లా బాడంగి మండలంలో మళ్లీ పులి సంచరిస్తుండటంతో గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి పులి ముప్పు ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. రావివలస గ్రామంలో గురువారం రాత్రి కొల్లి ఎరుకునాయుడుకు చెందిన ఎద్దును పులి దాడి చేసి చంపేసింది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన రెండు ఆవులను, అల్లుపాల్తేరుకు చెందిన ఒక ఆవును పులి దాడి చంపేసిన విషయం తెలిసిందే. మళ్లీ గురువారం రాత్రి పులి దాడిలో ఎద్దు మరణించడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు, ఎస్‌ఐ జయంతి.. పులిదాడిలో మరణించిన ఎద్దును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు జాగ్రత్తలు సూచించారు.