ప్రజాశక్తి- బొబ్బిలి: ఈ నెల 21,22 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న 21వ రాష్ట్ర మహా సభలు విజయవంతం చేయాలని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్, ఉపాధ్యాయ సంఘం నాయకులు జెస ిరాజు అన్నారు. మహా సభలకు వెళ్తున్న ఎన్‌జిఒల వాహనాన్ని స్థానిక ఎన్‌జిఒ హోమ్ వద్ద ఆయన ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపా ధ్యాయ, కార్మిక, పింఛను దారుల సమస్య లను మహా సభల్లో చర్చించి వాటిని ప్రభుత్వం ఆమోదించేలా కృషి చేయాల న్నారు. సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేసేలా మహాసభలో తీర్మానం చేయాలని కోరారు. బొబ్బిలి తాలూకా యూనిట్ నుండి వివిధ శాఖలకు చెందిన 80 మంది ఉద్యోగులు మహాసభలకు హాజరవుతున్నట్లు బొబ్బిలి యూనిట్ ప్రధాన కార్యదర్శి బి రామారావు, ఉపాధ్యక్షులు జి రామారావులు తెలిపారు. కార్యక్రమంలో చుక్క శ్రీను, శంకర రావు, గౌరీ శంకర రావు, కర్ణ, సత్య రాజు ఉద్యోగులు పాల్గొన్నారు.










