ప్రజాశక్తి - నెల్లిమర్ల : నగర పంచాయతిలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం నగర పంచాయతి పరిధి థామస్ పేట 15,16 వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డుల్లో పర్యటించి సంక్షేమ పథకాలు అమలు, జరుగుతున్న అభివృద్ధి పనులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర పంచాయతి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాదాన్యత ఇస్తుందన్నారు. వైసిపి పాలనలో సంక్షేమ పథకాలతో బాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ బంగారు సరోజినీ, వైస్ ఛైర్మన్‌లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, కో ఆప్షన్ సభ్యులు చిక్కాల సాంబశివరావు, జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మైపాడ ప్రసాద్, మొయిదశ్రీను, పాండ్రంకి సత్యవతి, నాయకులు గంటా అప్పల రాజు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్దే లక్ష్యం
బాడంగి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడమే సిఎం ఉద్దేశం అని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు. గురువారం మండలంలోని గూడెపువలస సచివాలయం పరిధి గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వం అందిస్తుందన్నారు. తాగు నీటి కోసం ప్రత్యక చర్యలు తీసికోవాలని అధికారులకు ఆదేశించారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపొతే వెంటనే సచివాలయం సిబ్బంది తగు చర్యలు తీసికోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శంబంగి వేణుగోపాల్, శంబంగి శ్రీకాంత్, తెంటు మధు, మరిపి శంకర్, ఎంపిపి గౌరి, జెడ్‌పిటిసి రామారావు, సర్పంచ్ గణేష్ పాల్గొన్నారు.










