ప్రజాశక్తి -పూసపాటిరేగ : మండలంలోని మైలాన్ పరిశ్రమ వద్ద బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా యునైటెడ్ మైలాన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అద్యక్షలు బి. సూర్యనారాయణ మాట్లాడుతూ మైలాన్ పరిశ్రమలో ఎంబి-11లో వెల్‌సెట్రన్న్ అనే కెమికల్ వల్ల కార్మికులకు కిడ్నీ, గుండె జబ్బులు వస్తున్నాయన్నారు. దీంతో గతంలో సూమారు 20 మందిని ఎంబి -11 నుండి ఇతర సేఫ్టీ బ్లాకులకు మార్చార న్నారు. వారితో పాటు ఎం.సూరిబాబు అనే కార్మికుడును ఎహెచ ్‌యు డిపార్టుమెంట్‌కు మార్చారన్నారు. అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు ఎంబి-11కి మార్చేస్తున్నారన్నారు. ఇది సరైంది కాదని నిరసన చేస్తున్నామన్నారు. సూరిబాబును ప్రస్తుతం పనిచేస్తున్న డిపార్ట్ మెంట్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం, కాంట్రాక్టరులు స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకొచ్చారని తెలిపారు. సూరిబాబుకు ఈరోజు నుండే డ్యూటీ ఇవ్వడానికి, సూరిబాబుతో పోరాటంలో ఉన్న వాళ్ళని కూడా డ్యూటీకి తీసుకోవడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. గురువారం కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి గతంలో బ్లాకు మార్చిన 20 మంది కార్మికులకు ఏదైతే నిర్ణయం చేశామో సూరిబాబు కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరిన నేపథ్యంలో సిఐటియు దానికి అంగీకరించి పోరాటాన్ని విరమించిందని చెప్పారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.నారం నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎం సూరిబాబు, వైస్ ప్రెసిడెంట్ పతివాడ శ్రీను, జాయింట్ సెక్రెటరీ అప్పలనాయుడు, కార్మికులు పాల్గొన్నారు.










