ప్రజాశక్తి-విజయనగరం : ఇటీవల శ్రీలంక దేశంలోని దియాగమ మహీంద రాజపక్స స్టేడియంలో ఆగస్టు 19 నుండి 21 వరకు జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీల్లో విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వి.కృష్ణం నాయుడు విశేష ప్రతిభ కనబర్చి రెండు రజత, ఒక కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన కృష్ణంనాయుడు గురువారం ఎస్పి దీపికను జిల్లాపోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయనను ఎస్పి అభినందించి అతని క్రీడా ప్రతిభను ప్రశంసించారు. ఎస్పి మాట్లాడుతూ - జిల్లా పోలీసుశాఖలో హెడ్ కానిస్టేబులుగా పని చేస్తున్న కష్ణమూర్తి క్రీడల పట్ల ఎంతో ఆసక్తితో సాధన చేసి, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. కృష్ణంనాయుడును ఇన్ఛార్జి డిఎస్పి ఆర్.శ్రీనివాసరావు, రూరల్ సిఐ టివి తిరుపతిరావు, ఎస్ఐగణేష్ అభినందించారు.










