Aug 26,2023 20:01

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న వనటౌన్‌ సిఐ వెంకటరావు

ప్రజాశక్తి-విజయనగరం :  నగరంలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీ విద్యార్థులతో వన్‌టౌన్‌ సిఐ బి.వెంకటరావు శనివారం సమావేశమయ్యారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసే మత్తు, మాదక ద్రవ్యాలు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తులు వాటి నుండి బయట పడలేక, విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతూ, భవిష్యత్తు నాశనం చేసుకొంటూ, తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారని అన్నారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ఎస్‌.భాస్కరరావు, ఎన్‌ఆర్‌ఐ కాలేజి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.