Aug 27,2023 20:19

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంబంగి

ప్రజాశక్తి- బొబ్బిలి : క్రీడలతో యువత, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరియంలో ఆదివారం తైక్వాండో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో యువత, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడలు పట్ల యువత, విద్యార్థులు ఆసక్తి కనబరచాలని కోరారు. తైక్వాండో పోటీలకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సెట్విజ్‌ సిఇఒ బి.రామ్‌ గోపాల్‌, వైసిపి మండల అధ్యక్షులు శంబంగి వేణుగోపాల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, కౌన్సిలర్‌ చోడిగంజి రమేష్‌ నాయుడు, కోచ్‌ బంకురు ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.