Sep 02,2023 22:15

భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేస్తున్న గుమ్మడి సంధ్యారాణి

ప్రజాశక్తి-మెంటాడ :  అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు జి.సంధ్యారాణి తెలిపారు. శనివారం మండలంలోని ఆండ్ర గ్రామంలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనిమిది సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచిన ఏకైక ప్రభుత్వం వైసిపి సర్కారేనని ఎద్దేవాచేశారు. టిడిపి హయాంలో ఎపిలో లోటు విద్యుత్తు నుంచి మిగులు విద్యుత్తు రాష్ట్రంగా చంద్రబాబునాయుడు మార్చారని, వైసిపి గద్దెనెక్కాక మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని విమర్శించారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి అమలు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు చలుమూరి వెంకటరావు, జి.అన్నవరం, రెడ్డి ఎర్నాయుడు, కాశీవిశ్వనాథం, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.