గాయపడిన బాలుడు
ప్రజాశక్తి - నెల్లిమర్ల : నగర పంచాయతిలో జరిగిన కోతి దాడిలో 12మందికి గాయాలయ్యాయి. శనివారం స్థానిక గాంధీ నగర్ కాలనీ, సెగిడి వీధిలో కోతి దాడి చేసి చిన్న పిల్లలను కరిచింది. ఎక్కడ నుంచో ఒక కోతి వీధిలోకి వచ్చిందని దానికి ఆదరించి ఆహారం పెడితే తిని పిల్లలతో ఆడుకొని ఒక్కసారిగా దాడి చేసి గాయ పర్చినట్ల స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారు స్థానిక సిహెచ్‌సిలో చికిత్స తీసుకున్నారు.










