రాజీనామ పత్రాన్ని చూపిస్తున్న రియాజ్‌ఖాన్
ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సిపల్ కో-అప్షన్ పదవికి రాజీనామా చేయనున్నట్లు రియాజ్ ఖాన్ చెప్పారు. టిటిడి కల్యాణ మండపం రోడ్డులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు తాను న్యాయం చేసుకోలేకపోతున్నానని, ప్రజలకు న్యాయం చేయలేనని చెప్పారు. తనకు, ప్రజలకు న్యాయం చేయని పదవి తనకు వద్దని, కో-అప్షన్ పదవికి రాజీనామా చేసి రాజీనామా లేఖను మున్సిపల్ అధికారులకు అందజేస్తానని చెప్పారు. రాజీనామ చేసినా వైసిపిలోనే కొనసాగుతానని అన్నారు. తనకు ఉపాధి కల్పించే బడ్డీను తొలగించడం చాలా బాధ కలిగించిందన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్డీను తొలగించడానికి నిరసనగా బడ్డీని తగలబెట్టాలని చూసి ఫ్లెక్సీను తగలబెట్టానని చెప్పారు.










