ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్రకే వన్నె తెచ్చిన ఎన్నో కళలు నేడు మరుగున పడుతున్నాయని, వాటిని పరిరక్షించా ల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ప్రపంచ జానపద కళల దినోత్సవం సందర్భంగా విజయనగరం రాగ సుధా రంగస్థల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుర్రకథల పోటీలు నిర్వహించారు. బుక్కవీధిలో గల ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో మంగళవారం జరిగిన పోటీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు బుర్రకథ బృందాలు పాల్గొని ప్రదర్శన లిచ్చాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోలగట్ల.. కళా బృందాల ప్రదర్శనలను తిలకించి, నిర్వాహకులను అభినంది ంచారు. అనంతరం మాట్లాడుతూ.. జానపద కళ అనేది ఎంతో శ్రమ, పట్టుదల ఉంటే గానీ చేయలేమని, అలా చేసే వారిని ప్రోత్సహించేలా చూడాలని అన్నారు. ప్రాచీన జానపద కళారూపంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకప్పుడు విశేష ప్రజాదరణ పొందిన బుర్రకథ... టివి మాధ్యమం ప్రజల్లోకి వచ్చాక కాస్త ఆదరణ కోల్పోయిందని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత కొన్ని కళారూపాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదానికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాగసుధ రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కళలను బతికించేందుకు, కళాకారులను ఆదుకునేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమ ంలో కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధి సుధాకర్ పాల్గొన్నారు.
ఉడా కాలనీలో గడప గడపకూ..
నగరంలోని 43వ డివిజన్ ఉడా కాలనీ ప్రాంతంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం లో జోనల్ ఇన్చార్జిలు కోలగట్ల తమ్మన్న శెట్టి, డాక్టర్ విఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ప్రభుత్వం పథకాలు పొందుతున్న లబ్ధిదారుల వివరాలతో కూడిన బుక్లెట్లను అందజేశారు. స్థానిక సమస్యల పైన ఆరా తీశారు. వాటిపై తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు సూచించారు. డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ అవినీతి, లంచగొండి తనం లేకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నా యని చెప్పడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా పటిమకు నిదర్శనమని అన్నారు. కార్పొరేటర్ దాసరి సత్యవతి, డివిజన్ అధ్యక్షుడు వంతరాం సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










