విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న కేసలి అప్పారావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయ దుర్గ యూత్ సొసైటీ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా విజయనగరం కెజిబివి వసతి గృహంలో బాలికలకు క్రీడా పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ కేశవపట్నం జయలక్ష్మి చేతులు మీదుగా విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేసలి అప్పారావు మాట్లాడుతూ విజయ దుర్గ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో రెండేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ వి.సత్యగౌరి, కెజిబివి ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.










