ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని,పెరిగిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అధ్వర్యంలో స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడారు. ధర్నా లో సిపిఎం నాయకులు కె.సురేష్, ఎ.జగన్మోహన్, పి.రమణమ్మ, బి.రమణ, కె.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. రాజాం తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు కాలంలో ప్రజలకి భారాలు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతిస్తూ పరిపాలన సాగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలోనూ, ధరలను అదుపు చేయడంలోనూ ఘోరంగా విఫలమైందన్నారు. గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్లకు బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తూ పేద ప్రజలపై పన్నులు మోపుతోందన్నారు. ఈ విధానాలను జగన్ ప్రభుత్వం తూచా తప్పకుండా వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధానాల్ని అతి ఉత్సాహంతో అమలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలపై వివిధ రకాల పన్నుల భారాన్ని మోపుతున్నారని తీవ్రంగా విమర్శించారు. సిపిఎం నాయకులు రామ్మూర్తి నాయుడు, శ్రీనివాసరావు, సత్యారావు, రాంబాబు, రామయ్య, రాజేష్, తేజ మారేష్, కుమార్, గిరి, కృష్ణ్ణ తదితరులు పాల్గొన్నారు. రేగిడి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ప్రజా సమస్యలపై తహశీల్దార్ టి. కళ్యాణ చక్రవర్తికు వినతి పత్రం అందజేశారు. గరివిడి తహశీల్దార్ కార్యాలయంవద్ద జరిగిన ధర్నాలో సిపిఎం నాయకులు టివి రమణ మాట్లాడారు. కార్యక్రమంలో ఎ.గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం మండల కార్యదర్శి ఎం.త్రినాధరావు, నాయకులు పోరెడ్డి విశ్వనాథం, కే. తిరుపతిరావు పాల్గొన్నారు. పూసపాటిరేగ మండల కేంద్రంలో సచివాలయ కార్యదర్శి వెంకటరావుకు సిపిఎం నాయకులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.సూర్యనారాయణ, మజ్జి సూరిబాబు, గురువులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాడంగి తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేష్, తదితరులు పాల్గొన్నారు. తెర్లాం తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం మండల కార్యదర్శి ఎస్.గోపాల్ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ రత్నకుమార్‌కు వినతి అందించారు. కొత్తవలస తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్‌కు సిపిఎం ఆధ్వర్యాన వినతి అందించారు. సిపిఎం నాయకులు గాడి అప్పారావు పాల్గొన్నారు. బొబ్బిలిరూరల్ తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు ఆధ్వర్యాన తహశీల్దార్‌కు వినతి అందించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి.గౌరీ, జె.రామారావు, ఆదిలక్ష్మి, రామలక్ష్మి పాల్గొన్నారు. లక్కవరపుకోట తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ ఆదిబాబుకు వినతి అందించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గాడి అప్పారావు, మండల నాయకులు తరిణి వెంకటరమణ, అప్పలనరసింహ, సత్యవతి, రాములమ్మ, సుబ్బయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ ఆధ్వర్యాన ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ భరత్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు చెలికాని ముత్యాలు, భాస్కరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాము, తదితరులు పాల్గొన్నారు. మెంటాడ మండల కాంప్లెక్సు ఆవరణలో సిపిఎం మండల కార్యదర్శి రాకోటి రాములు ఆధ్వర్యాన ధర్నా చేశారు. అనంతరం ఎంపిడిఒ త్రివిక్రమరావుకు, తహశీల్దార్‌కు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు టి.సోములు, సిహెచ్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. గంట్యాడ తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ఆర్.ఆనంద్ ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ స్వర్ణకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమములో మండల నాయకులు ఎం.రామారావు, పి.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. వేపాడ తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చల్లా జగన్, తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జి.శ్రీనివాస్ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. అనంతరం తహశీల్దార్‌కు వినతినిచ్చారు. కార్యక్రమంలో కష్ణ గౌరీ సూర్యనారాయణ సింహాచలం, తాత, పెద్ద రాము, శ్రీను, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.










