ప్రజాశక్తి-రామభద్రపురం : జయహో భారత్... జయహో విక్రమ్ ... జయ జయహో ఇస్రో.. అంటూ గురువారం విద్యార్థులు, ఉపాద్యాయులు నాయడువలస పాఠశాలలో సందడి చేశారు. చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, ఉపాద్యాయులు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ మేరా భారత్ మహాన్... జయహో ఇస్రో అంటూ నినదించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రెడ్డి వేణు, ఉపాధ్యాయులు జెసి రాజు, శేఖర్, శివున్నాయుడు, కృష్ణంనాయుడు పాల్గొన్నారు.
బొబ్బిలి : చంద్రయాన్-3 విజయవంతం కావడంతో దేశానికి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు వచ్చిందని వాసు విద్యాసంస్థల కరస్పాండెంట్ రౌతు వాసుదేవరావు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో వాసు జూనియర్, శ్రీ శిరిడి సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు పట్టణంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.










