Aug 28,2023 20:52

విజయనగరం: క్రీడాకారులను అభినందిస్తున్న సత్య డిగ్రీ కళాశాల ప్రతినిధులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: జిల్లాస్థాయి కరాటే పోటీలలో విజయనగరం లోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పతకాలు సాధించారు. ఈ మేరకు కోచ్‌ కానూరు సంతోష్‌ కుమార్‌ తెలిపారు. డ్రాగన్‌ పవర్‌ పంచ్‌ కరాటే డూ-అసోసియేషన్‌ సుమన్‌ కప్‌ 2023 పోటీలు కొత్తవలస లో ఆదివారం జరిగాయి. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు పి .కుశ్వంత్‌, ఎస్‌ .గీతిక్‌ వర్మ కుమిటిలో బంగారు, కాటాలో కాంస్య పతకం సాధించారు. పి.హేమంత్‌ కుమిటీలో కాంస్య, కాటాలో బంగారు పతకం సాధించారు. ఎస్‌. కార్తీక్‌, బి యశ్వంత్‌ కుముటిలో వెండి, కాటాలో కాంస్య పతకాలు సాధించారు. జె.నవీన్‌ నంద కుమిటిలో వెండి, కాటాలో కాంస్య పథకం సాధించారు. ఆర్‌ వంశీవరుణ్‌ రెండు విభాగాల్లో కూడా వెండి పతకం సాధించగా బి.శివ శ్రీహర్ష, బి షణ్ముఖ శ్రీ కర్‌, ఎస్‌ జితేంద్ర లు రెండు విభాగాలలో కాంస్య పతకాలు సాధించారు. సత్య డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కరాటే శిక్షణ పొందిన వీరిని కళాశాల డైరెక్టర్‌ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపల్‌ సాయి దేవమణి, కెన్యూరియో కరాటే అసోసియేషన్‌ కోచ్‌ కె. సంతోష్‌ కుమార్‌, అధ్యక్షుడు సుమన్‌ అభినందించారు.
తైక్వాండో పోటీల్లో ప్రతిభ
రామభద్రపురం: ఇటీవల బొబ్బిలిలో నిర్వహించిన 16వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో స్థానిక గ్లోబల్‌ వ్యూ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్కూల్‌ కరస్పాండెంట్‌ మోహన్‌ తెలిపిన వివరాల మేరకు జూనియర్‌, సీనియర్‌ విభాగాలలో 5 బంగారు, ఒక రజత 8 కాంస్య పతకాలుతో పాటు ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో జిల్లా స్థాయిలో రెండో స్థానం సాధించారన్నారు. వీరిని స్కూల్‌ చైర్మన్‌ పి.వెంకట రమణ, ప్రిన్సిపాల్‌ సంధ్య, కరస్పాండెంట్‌ మోహన్‌, కోఆర్డినేటర్‌ రామకృష్ణ, కోచ్‌ సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది అభినందించారు. తమ స్కూల్‌ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ చూపుతున్నారని ఇది తమకెంతో గర్వకారణమని అన్నారు.
క్రీడలపై ఆసక్తి కనబరచాలి
బొబ్బిలి: విద్యార్థులు, యువత క్రీడలపై ఆసక్తి కనబరచాలని టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అన్నారు. శ్రీకళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన తైక్వాండో పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు పట్ల విద్యార్థులు, యువత ఆసక్తి కనబరచాలన్నారు. తైక్వాండో క్రీడతో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తైక్వాండోతో ఆత్మరక్షణ పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో సెట్విజ్‌ సిఇఒ రామ్‌ గోపాల్‌, కోచ్‌ బంకురు ప్రసాద్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.
కరాటేలో కాంస్య పతకం
కొత్తవలస: స్థానిక వాగ్దేవి జూనియర్‌ కళాశాల విద్యార్థి కె. లక్ష్మీ దీపక్‌ జూనియర్‌ తైక్వాండో కరాటాలో కాంస్య పతకం సాధించాడని కళాశాల కరస్పాండెంట్‌ కోటిన మహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదిన వైజాగ్‌లో జరిగిన ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ కరాటే ఛాంపియన్‌ షిప్‌ 2023 పోటీల్లో పాల్గొన్నా లక్ష్మీ దీపక్‌ ఈ మెడల్‌ సాదించాడని తెలిపారు. మెడల్‌ సాధించిన దీపక్‌ను కళాశాల యాజమాన్యం కె. మహేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ ఎస్‌ఇ కుమారబాబు అభినందించారు.