Sep 08,2023 21:49

బాడంగి.. సమీక్షలో మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి సూర్యచంద్రరావు

ప్రజాశక్తి-తెర్లాం :  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం ఎంపిడిఒ ఎస్‌.రామకృష్ణ వైద్యసిబ్బందితో సమీక్షించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యం, పాటించాల్సిన విధివిధానాలపై సూచనలు చేశారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. రిఫరల్‌ కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వాలంటీర్లు తమ క్లస్టర్‌లోని ఇంళ్లకు వెళ్లి జెఎఎస్‌, ఎఎన్‌ఎం సందర్శన షెడ్యూల్‌పై అవగాహన కల్పిస్తారని తెలిపారు.
బాడంగి : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఎంపిడిఒ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి సిహెచ్‌.సూర్యచంద్ర రావు సమీక్షించారు. ఎంపిడిఒ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు వెళ్లి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించాలని తెలిపారు. ఆ సమాచారం ఆధారంగా ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు ఈ నెల 16 నుంచి ఇంటింటికి వచ్చి బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అదే గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. వైద్య శిబిరాల్లో 105 రకాల ఔషదాలు అందుబాటులో ఉంటాయని, వైద్య పరీక్షలన్నీ అక్కడే నిర్వహిస్తారని తెలిపారు.