ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జనవిజ్ఞాన వేదిక జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జన విజ్ఞాన వేదిక జిల్లా 12వ మహాసభ స్థానిక జిల్లా పరిషత్తు కాంపౌండ్‌లోని మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగింది. మహాసభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 'కృత్రిమ మేధస్సు' అనే అంశంపై 'ఫ్రీ సాఫ్ట్‌వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా' సంస్థ నుంచి శ్రీపతి రారు, 'చంద్రయాన్-3, ఆదిత్యా ఎల్ -1, ఇతర రోదసి యాత్రల'పై రమణ ప్రభాత్, 'స్వావలంబన -సైన్స్' అనే అంశంపై ఎం.వి.ఎన్. వెంకటరావు ప్రసంగించారు. ప్రజారోగ్యం ప్రజల ప్రాథమిక హక్కుగా ఉండాలని, గ్రంధాలయాల నిర్వహణ బాధ్యత రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని మహాసభ తీర్మానించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.రాజగోపాల్ సమన్వయంతో జరిగిన ఈ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ జె.చంద్రశేఖర్, జి.నీలయ్య, సింహాద్రి నాయుడు, అధ్యక్షులుగా డాక్టర్ ఎం.వి.ఎన్. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా పి.రమణ ప్రభాత్, సహాధ్యక్షులుగా కె.మురళీబాబు, ఉపాధ్యక్షులుగా పి.వేణుగోపాల్, పి.సత్యం నాయుడు, వి. రాజగోపాల్, జి.నిర్మల, వి.సుశీల, సహాయ కార్యదర్శిగా చంద్రశేఖర్, కార్యదర్శులుగా ఎస్.సత్యనారాయణ, డాక్టర్ చిన్నారి, చంద్రశేఖర్, సత్యశ్రీనివాస్, పి.లక్ష్ము నాయుడు, సతీష్, వి.మోహనరావు, కోశాధికారిగా సిహెచ్. సింహాచలం ఎన్నికయ్యారు.










