Sep 06,2023 20:14

విజయనగరం: గాజులురేగ నారాయణ పబ్లిక్‌ స్కూల్లో గోపిక వేశధారణలో పిల్లలు

ప్రజాశక్తి- బొబ్బిలి : పట్టణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న పిల్లలకు శ్రీకృష్ణుడు, గోపికలు వేషధారణ వేపించి ఉట్టులను కొట్టించారు. ఈ వేడుకలను చూసేందుకు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు, పిల్లలు హాజరయ్యారు.
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. టిడిపి విశాఖ పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షులు, ఉత్సవ కమిటీ చైర్మన్‌ తిక్కాన చిన్నదేముడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు వేదపండితులు పిలకా విశ్వనాధం ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజలు, మండప ఆవాహనాలు, పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్‌ పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోయి డాన్సులు, సాము గరిడీలు, శ్రీకృష్ణ వేషాలు, తప్పెడుగుళ్ళు, చిరుతలు, భజనలు, బాణాసంచాతో కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ (శ్రీను), టిడిపి రాష్ట్ర అయ్యారక సాధికార సమితి కన్వీనర్‌ బంగారు రమేష్‌, కొత్తవలస మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు, క్లస్టర్‌ ఇంఛార్జ్‌ పొట్నూరు వెంకట రత్నాజీ, టిడిపి విశాఖ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కొరుపోలు అప్పారావు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: నగర పంచాయతి పరిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రామతీర్ధం జంక్షన్‌లో దేవాంగుల వీధిలో ప్రబోధ సేవా సమితి- ఇందు జ్ఞాన వేదిక విజయనగరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం కోలాటాలతో పుర వీధుల్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు లెంక అప్పల నాయుడు, ప్రభోద సేవా సమితి సభ్యులు బత్తుల గోవింద, తులసి, శ్రీనివాసరావు, శ్రీదేవి, ధనలక్ష్మి, వినోద్‌ కుమార్‌, కృష్ణమ్మ పాల్గొన్నారు.
వేపాడ: మండలంలో బక్కు నాయుడుపేట, వేపాడ, జాకేరు, కృష్ణరాయుడుపేట గ్రామాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భారీగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.
లక్కవరపుకోట: మండల కేంద్రంలో ఉన్న శ్రీచైతన్య ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గోపికలు, శ్రీకృష్ణుని మాదిరిగా అలరించిన వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఎస్‌వి రమణ, ఉపాధ్యాయ బృందం ఎస్‌ హారిక, సీనియర్‌ కరాటే శిక్షకులు రాజు మాస్టర్‌, టి శ్రీనివాసరావు, డి రామసత్యం, ఎం సత్యనారాయణ, కనకమహాలక్ష్మి, పి రామలక్ష్మి, ఏ మంజులత, కె వెంకటలక్ష్మి, వి.పైడిరాజు, బి.భవాని, ఆషా, సుగేని, పి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
మెరకముడిదాం: మండల కేంద్రంలోని సన్‌రైజ్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్‌ బివిఆర్‌ మూర్తి ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించారు. పాఠశాల చిన్నారులు వేసిన రాధా, కృష్ణుని వేష దారణలు చూపరులను ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుని జనన ప్రదర్శన, బృందావన నృత్య ప్రదర్శనలు విద్యార్థుల తల్లి తండ్రులను, పాఠశాల సిబ్బందిని మంత్రముగ్థులను చేశాయి. కార్యక్రమంలో పాఠశాల మేనేజ్‌ మెంట్‌ తరపున నాగరాజు, అరుణ కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్‌ : శ్రీకష్ణుడు మహా జ్ఞాన సంపన్నుడని డిప్యూటీస్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రబోధ సేవాసమితి- ఇందూ జ్ఞానవేదిక విజయనగరం శాఖ ఆధ్వర్యంలో గురజాడ కళాభారతి ఆడిటోరియం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శాఖ అధ్యక్షులు వానపల్లి శంకరరావు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోలగట్ల మాట్లాడుతూ.. భగవద్గీత నిజ భావాన్ని తెలియజేసే ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత అందరూ చదవాలని సూచించారు. ప్రబోధ సేవా సమితి సభ్యులు ఏ కార్యక్రమం చేపట్టినా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. సుమారు పదేళ్లుగా జిల్లాలో ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నామని శంకరావు తెలిపారు. ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామివారిని పల్లకిలో ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం, బీసీ సంఘం నాయకులు ముద్దాడ మధు, మన్యాల కృష్ణ, బొద్దాన అప్పారావు, గదుల సత్యలత, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్‌, కోట: నగరంలోని పలు పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రింగురోడ్డు వద్ద గల నారాయణ పైడితల్లి భవన్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధాయురాలు ప్రభావతి దేవీ , పాఠశాల ఆర్‌ఐ రాజేష్‌ , పాఠశాల కో ఆర్డినేటర్‌ దమయంతి విచ్చేసి విద్యార్థులకు శ్రీ కృష్ణ జన్మ వృత్తాంతాన్ని వివరించారు. మంచిని గెలిపించేందుకు చెడుతో శ్రీకృష్ణుడు పోరాటం చేశాడని అన్నారు. విద్యార్థులు రాధాకృష్ణుని వేషధారణలో వచ్చి, సంగీత నత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పలుచోట్ల ఘనంగా జరిగాయి. విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలతో అలరించారు. శ్రీనివాస ఆర్ట్స్‌ అకాడమీ , నారాయణ స్కూల్‌ సంయుక్త నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ మొయిద నారా యణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంస్కతి సాంప్రదాయాలు విలువలను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహద పడతాయన్నారు. శ్రీనివాస ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ రామానాయుడు మాట్లాడుతూ మన పండగల విశిష్టతను గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియపరచడం వలన వాటిని పరిరక్షించుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.