Aug 20,2023 21:14

బొబ్బిలి: ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని పెద్ద తాడివాడ జనక్షన్‌ వద్ద రాజీవ్‌ గాంధీ 79వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. డిసిసి అధ్యక్షుడు సరగడ రమేష్‌ కుమార్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తెలుగు సూరిబాబు, రవి చిలక రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాంగ్రెస్‌ నేతలు మువ్వల శ్రీనివాసరావు, ఎం.వెంకటరమణ, కార్యకర్తలు రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. ముందుగా కాంగ్రెస్‌ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి రాజీవ్‌ గాంధీ పని చేశారని వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గడి బంగారు నాయుడు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 79వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడి బంగారు నాయుడు, హనుమల్‌ శెట్టి నానాజీ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే ఒక్క కాంగ్రెస్‌ పార్టీవల్లనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని బడుగు బలహీన వర్గాలకు అండగ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌టి సెల్‌ చైర్మన్‌ చీమల అచ్చిబాబు, జిల్లా బీసీ సెక్రటరీ రాపేటి గోవర్ధన్‌ కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.