ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు గురాన అయ్యలు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోట జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం గాజులరేగ, గంజిపేట, దుప్పాడ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం నరవ గ్రామంలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్?లో పలువురు రక్తదాన దానం చేశారు. అనంతరం హుకుంపేట లో జన్మదిన వేడుకలు నిర్వహించి జనసేన కిట్లు పంపిణీ చేశారు.లంకాపట్నంలో చీరలు పంపిణీ చేశారు. అనంతరం హోటల్ జిఎస్‌ఆర్ వద్ద భారీ అన్నదానం చేపట్టారు. జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో బర్త్ డే కేక్‌ని ఆయ్యలు కట్ చేశారు. గుర్ల మండలం కెల్ల గ్రామంలో వాలీబాల్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు.










