ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పుట్టినరోజు వేడుకులను వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరమంతా అన్న దానాలు చేపట్టారు. మహిళలకు పసుపు కుంకుమలతో పాటు సారెగా బిందెలు, చీరలు పంపిణీ చేశారు. వృద్దులు, అనాధులకు పండ్లు పంచారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు ద్వారా అభిమానులు స్వచ్ఛంద రక్త దానం చేశారు. మరో వైపు నగరమంతా ఫ్లెక్సీలతో కార్యకర్తలు తమ అభిమానం చాటుకున్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయంలో వైసిపి నాయకులు పిల్లా విజరు కుమార్, అవనాపు విజరు ఆధ్వర్యాన పూజలు చేశారు. బొడ్డు వారి జంక్షన్ కూడలి వద్ద అవనాపు విజరు తో కలిసి గొడుగులు పంపిణీ చేశారు. అంబటి సత్రం మస్తాన్ దర్గా వద్ద 500 మంది ముస్లిం మైనార్టీలకు దుప్పట్లు, వస్త్రాలు, రేషన్ పంచి పెట్టారు. ప్రేమసమాజంలో వృద్ధులకు భోజనం పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్ద నిరుపేద కుటుంబానికి తోపుడు బండిని అందించారు. పినవేమలిలోని ఎబిసిడి వృద్ధాశ్రమం లో వృద్దులకు భోజనం పెట్టారు. నగరంలో ఫుడ్ కోర్టుల వద్ద ప్రజలకు అన్నదానం చేశారు. జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సిఇఒ రాజ్‌కుమార్ ఆధ్వర్యాన చిన్నశ్రీను జన్మదిన వేడుకలు జరిగాయి. రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బొబ్బిలి జడ్‌పిటిసి శాంతి కుమారి, పిఆర్ ఇఇ కెజిజె నాయుడు, జెడ్‌పి ఛాంబర్ సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తవలస : జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పుట్టిన రోజున పురష్కరించుకుని మంగళవారం స్థానిక తుమ్మికాపల్లిలో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో 40 మంది ఒంటరి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారికి అన్నదానం చేశారు. కంటకాపల్లి సర్పంచ్ మదీనా అప్పల రమణ, చిన్నరావుపల్లి సర్పంచ్ భూసాల దేముడు, నిమ్మలపాలెం సర్పంచ్ కొట్యాడ శ్రీను, వైసిపి నాయకులు మదీనా ప్రకాష్ ఆర్థిక సహాయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, పిఎసిస్ అధ్యక్షులు గొరపల్లి శివ, సీనియర్ నాయకులు మేలాస్త్రి అప్పారావు, వైస్ ఎంపిపి కర్రీ శ్రీను, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, పెనగంటి చెల్లయ్య, ట్రస్ట్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్, సభ్యులు గోవిందరావు వరహాలు నగేష్ ధర్మ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లక్కవరపుకోట: జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను మండల కేంద్రంలోని ఎంపిపి కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపిపి గేదెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలిత కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసిఎస్ కన్వీనర్ యడ్ల కిషోర్ కుమార్, సర్పంచులు మమ్మున ప్రసాదరావు, ఆవాలు సత్యనారాయణ, ఎంపిటిసిలు బొడ్డు గణపతి, భూమిరెడ్డి స్వామినాయుడు, వైసిపి నాయకులు, పాల్గొన్నారు.
తెర్లాం: మండల ప్రజా పరిషత్ ఆవరణంలో జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉమాలక్ష్మి, ఎఎంసి చైర్మన్ బి శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి ఎస్ సత్యనారాయణ, వైసిపి మండల అధ్యక్షులు, సర్పంచులు పాల్గొన్నారు. పెరుమాలి వైసిపి కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ కేక్ కట్ చేస్తూ మిఠాయిలు పంచారు.
డెంకాడ: జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు మండలంలోని జొన్నాడలో నియోజవర్గ స్థాయిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖరరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పి సురేష్ బాబు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ప్రజల సమక్షంలో భారీ కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










